అఖిల భారత గౌడ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా మధుసూధన్ గౌడ్

నవతెలంగాణ-హిమాయత్ నగర్ 
అఖిల భారత గౌడ సంఘం నల్గొండ జిల్లా నూతన అధ్యక్షుడిగా చిట్యాల మండలం, గుండ్రంపల్లి గ్రామానికి చెందిన చెరుకు మధుసూధన్ గౌడ్ ను నియమించినట్లు అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కూరెళ్ళ వేములయ్య గౌడ్ తెలిపారు.బుధవారం సంఘం కార్యాలయంలో వేములయ్య గౌడ్ చేతుల మీదుగా మధుసూధన్ గౌడ్ కు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా కూరెళ్ళ వేములయ్య గౌడ్ మాట్లాడుతూ..గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.గౌడ యువకులను ప్రోత్సహిస్తూ వారికి వెన్నంటే ఉంటూ సహాయ, సహకారాలు అందిస్తూ అఖిల భారత గౌడ సంఘం నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు.గౌడ్ లను అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఉండాలని దానికి కార్యాచరణ రూపొందించాలని కోరారు.అనంతరం మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా సంఘం బలోపేతం కోసం, గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.తనపై విశ్వాసంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించిన కూరెళ్ళ వేములయ్య గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ కార్యదర్శి మిద్దెల మల్లేశం గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు నందగిరి ఆంజనేయులు గౌడ్, అఖిల భారత గౌడ సంఘం యువజన విభాగం యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరమళ్ళ కార్తీక్ గౌడ్, నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు గోపగొని లింగస్వామి గౌడ్, స్థానిక గౌడ సొసైటీ అధ్యక్షులు బక్కశెట్టి గౌడ్, అంతటి సదానందం గౌడ్, పానుగుల్ల వెంకటేష్ గౌడ్, బొడిగె ప్రభాకర్ గౌడ్, చెరుకు రామలింగం గౌడ్, బోడిగే అంజయ్య గౌడ్, నమ్మల అనిల్ గౌడ్, బత్తుల మల్లేశం గౌడ్, బత్తుల సాయి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love