మార్చి1 న మాదిగ అమర వీరుల దినోత్సవం

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తోకల రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం మార్చి ఒకటి ఏసి రిజర్వేషన్ల వర్గీకరణ సాధనలో పశువులు బాసిన మాదిగ అమరవీరులకు ఉద్యమ నివాళులు అర్పించి అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రాష్ట్ర ఇంచార్జ్ ఇరుగు  పైడి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనలో అసువులు బాసిన మాదిగ అమర వీరులకు ఉద్యమ నివాళులు అర్పించారు. అనంతరం పైడి మాట్లాడుతూ వర్గీకరణ ఉద్యమంలో ఆశువులు బాసిన అమర వీరుల ఆశయాలను సాధిస్తూ ముందుకు సాగుతామని తెలియజేస్తున్నామనీ,మీ త్యాగ ఫలితమే అతి త్వరలోనే ఎస్సీ  రిజర్వేషన్ల వర్గీకరణ తుది ఫలతం అందుతుంది అని ఆశిస్తున్నామన్నారు. అనంతరం మహా జన పార్టీ జిల్లా అధ్యక్షులు మడి పెళ్లి శ్యాంబాబు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించకుండా ఎస్సీ వర్గీకరణ పై హామీ ఇచ్చి కాలయాపన చేస్తూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ  మాదిగల ఆగ్రహానికి గురై గాంధీభవఫై దాడి చేసిన ఘటనలో ప్రమాదావ శత్తు తీవ్రంగా గాయపడి మృతి చెందిన పొన్నాల సురేంద్ర . దామోదర్  మహేష్ .భారతి  చిత్రపటాలకు పూలమాలవేసి .ఎస్సీలను ఏబిసిడిలు గా వర్గీకరించాలని  మందకృష్ణ నాయకత్వంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  హయాములో ఎస్సీ వర్గీకరణపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా గాంధీభవన్ పై దాడి చేసిన ఘటనలో ప్రమాదవశత్తు కాలి తీవ్ర గాయాలతో మర్చి 1వ తేదీనమరణించడం జరిగిందని.వారి ఆశయ సాధనకై ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ఉదృతం  చేస్తా మని. తప్పకుండా ఎస్సీ వర్గీకరణ సాధిస్తామని. సాధించినప్పుడు మాత్రమే మనం అమరవీరులకిచ్చే నిజమైన ఘన నివ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ దుర్గారావు, ఎనగందుల మొగిలి.వేల్పుల సాంబయ్య, పసుల అమ్మయ్య,పసుల భద్రయ్య,సుంచుయాకూబ్  మడి పెళ్లి ఎల్ల స్వామి,మునిగాల  సాంబయ్య , సన్నీ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love