బీఆర్ఎస్ కు షాక్: కాంగ్రెస్ లోకి మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్

నవతెలంగాణ మద్నూర్: అధికార బీఆర్ఎస్ పార్టీకి మద్నూర్ మండలంలో భారీ షాక్ తగిలింది. మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరారు. మూడు నాలుగు రోజుల క్రితం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు.  ఆదివారం రాత్రి మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్, బిచ్కుంద మండల కేంద్రంలోని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున అప్ప ఇంట్లో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఆయనను జుక్కల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటా లక్ష్మి కాంతారావు కాంగ్రెస్ పార్టీ కండువా కాపీ పార్టీలోకి ఆహ్వానించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి వదలడంతో మద్నూర్ ఉమ్మడి మండలంలో ఆ పార్టీకి దెబ్బగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరడం పట్ల ఆ పార్టీకి సంగమేశ్వర్ ద్వారా భారీ మొత్తంలో లాభం చేకూరుతుందని వాదనలు ప్రజలు వినిపిస్తున్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ చేరికతో కాంగ్రెస్ పార్టీకి మరింతగా బలం చేకూరుతుందని వారు తెలిపారు.

Spread the love