నవతెలంగాణ- ఆర్మూర్
మండలంలోని మగ్గిడి పాఠశాలకు చెందిన క్రీడాకారులు కలిగోట్ గ్రామంలో జరిగిన జిల్లాస్థాయి ఎస్. జి ఎఫ్ .బీచ్ వాలీబాల్ పోటీలలో మొదటి స్థానం సంపాదించిన అండర్ 14 అండర్ 17 బాల బాలికలు మొదటి స్థానం సాధించినట్టు వ్యాయామ ఉపాధ్యాయులు మధు మంగళవారం తెలిపారు .విజయం సాధించిన ఈ క్రీడాకారులు ఈనెల 8వ తేదీ నుండి పదవ తేదీ వరకు మహబూబ్నగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో పాల్గొంటారు. వీరి ఎంపిక పట్ల ఎస్జీఎఫ్ సెక్రటరీ సంగీతరావు, పాఠశాల హెడ్మాస్టర్ హరిత, దాస్ నగర్ ప్రిన్సిపాల్ సంజీవరెడ్డి, గ్రామ సర్పంచ్ సుమలత నర్సయ్య వీడిసి సభ్యులు అభినందించడం జరిగింది.