– భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి
– బాణా సంచాలు కాల్చుటలో జాగ్రత్తలు తీసుకోవాలి
– అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం కలెక్టర్
నవతెలంగాణ-పాల్వంచ
వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రియాంక అలా తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశపు హాల్లో ముక్కోటి ఏకాదశి మహౌత్సవాలు నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన పనులను నిరంతర నిర్వేక్షణ చేస్తూ ఎలాంటి లోటు పాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తుల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా మన్నలను పొందే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మహోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షణ భద్రాచలం ఆర్డీవో బందోబస్తు ఏర్పాట్లు పోలీస్ శాఖ చేపట్టాలని ఆదేశించారు. లాడ్జి హౌటల్ యజమానులతో సమావేశం నిర్వహించి ధరల నిర్ణయించాలని డీఎస్‌ఓకు సూచించారు. ఆలయ పరిసరాల్లో సీసీటీవీలో ఏర్పాటు చేయాలని చెప్పారు. భద్రాచలం, దుమ్ముగూడెం దేవాలయాలతో పాటు భద్రాచలం వంతెన కరకట్టను విద్యుత్ దీపాలతో అలంకరించాలని చెప్పారు. భక్తుల మహౌత్సవాలు విక్షణకు ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హంస వాహనం తనిఖీ చేసి ధృవీకరణ నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఈని ఆదేశించారు. వాహనంలోకి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించాలని చెప్పారు. భక్తులుకు బస్సులు, రైలు సమయాలను అలాగే జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను తెలియజేయ విధంగా సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిపిఆర్‌ఓను ఆదేశించారు. సబ్ కలెక్టర్ ఎస్పీ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మహౌత్సవ రోజుల్లో 22, 23 తేదీల్లో మద్యం, మాంసాహారాలు నిలిపియాలని సమీప జిల్లాలు, రాష్ట్రాల నుంచి మద్యం నియంత్రణ చర్యలు చేపట్టాలని అబ్కారీ శాఖాధికారులకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, డీఆర్‌ఓ రవీంద్రనాథ్, దేవస్థానం ఈవో రమాదేవి, డీపీఓ రమాకాంత్, డీసీఓ వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బీ ఈలు వెంకటేశ్వర్లు, వైద్యాధికారి డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.