ఉసిరి చెట్టు కింద మహా అన్న సంతర్పణ కార్యక్రమం

నవతెలంగాణ-గోవిందరావుపేట

మండల కేంద్రంలోని శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయం లో శుక్రవారం కార్తీక మాసం సందర్బంగా  ఆలయ కమిటీ వారు ఉసిరి చెట్టు కింద మహా అన్నసంతర్పణ కార్య క్రమం నిర్వహించారు. ఆలయ పూజారి సాయి తేజ  పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం, స్వాములు, గ్రామ ప్రజలు ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వాములకు ఆలయమునకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న ఆకుల యుగంధర్ అనిత దంపతులు  మరియు యుగంధర్ తల్లి ఆకుల వినోద  చేతులమీదుగా అయ్యప్ప స్వాముల కు పొడి బిక్ష పెట్టీ స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Spread the love