రాజ్యాంగంపై నిర్లక్ష్యానికి నిరసనగా 12న మహాధర్నా..

– డీఎస్పీ మండలాధ్యక్షుడు లింగాల సురేశ్
– రాజ్యాంగాన్ని పాఠ్యంశంగా చేర్చాలని డిమాండ్
నవతెలంగాణ – బెజ్జంకి
డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ అమలుపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా రేపు డీఎస్పీ అద్వర్యంలో హైదరాబాద్ ఇందిర పార్క్ వద్ద మహాధర్నా తలపెట్టినట్టు డీఎస్పీ మండలాధ్యక్షుడు లింగాల సురేశ్ శనివారం తెలిపారు.ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ.. గత 40 రోజులుగా రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని జిల్లా,మండల కేంద్రాల్లోని అధికారులకు వినతిపత్రమందజేసి డీఎస్పీ నాయకులు సుదీర్ఘ పోరాటాలు చేసిన.. ప్రభుత్వాలు రాజ్యాంగ అమలుపై నిర్లక్ష్య దోరణి అవలంబించడం రాజ్యాంగాన్ని కించపరచడమేనని ఆరోపించారు.భారత రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లనే నేడు ప్రభుత్వ వ్యవస్థలు బ్రష్టు పడుతున్నాయని..రాజ్యాంగాన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో బోధనాంశంగా చేర్చాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.రాజ్యాంగంపై అవగాహన కలిగియుండే అవశ్యకత ప్రజలందరికి ఉందని.. ప్రభుత్వాలు అవగాహన కల్పించాలని లేని పక్షంలో డీఎస్పీ అద్వర్యంలో ధర్నా నుండి మరో ఉద్యమానికి సిద్దమవుతామని హెచ్చరించారు.రేపు ఇందిర పార్క్ వద్ద తలపెట్టిన మహాధర్నాను డీఎస్పీ నాయకులు,అంబేడ్కర్ వారసులు,మేథావులు,యువత పెద్ద సంఖ్యలో హజరై విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Spread the love