మంచిప్ప గ్రామంలో మహాలక్ష్మి ,అమ్మవార్ల జాతర..

నవతెలంగాణ – మోపాల్ 

గురువారం రోజున మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో బుద్ధ పూర్ణిమ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 44 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం బుద్ధ పూర్ణిమ రోజున మహాలక్ష్మి అమ్మ మరియు గజ్జలమ్మ వార్లకు జాతర నిర్వహించి గ్రామ ప్రజలు తమ మొక్కులను చెల్లించుకోవడం జరుగింది. ఈ జాతర వలన ప్రజల మధ్య సమైక్యత భావాన్ని అన్యోన్యత భావాన్ని మత సమరస్య భావాన్ని  పెంపొందించుటకు ఉపయోగపడతాయని మహాలక్ష్మి గజలమ్మ జాతర నిర్వహించి జాతరలో భాగంగా బుధవారం రథోత్సవం కార్యక్రమం ముగించుకొని గురువారం రోజున కుస్తిల పోటీలునిర్వహించడం జరిగింది. ఈ కుస్తీల పోటీలో కర్ణాటక, మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రం నుండి మల్ల యోధులు వచ్చి కుస్తీలో పోటీలో పాల్గొనడం జరిగింది, గెలుపొందిన వీరులకు బహుమతులు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అందచేయడం జరిగింది .ఈ కుస్తీల పోటీలలో విజేతగా నిలిచిన వ్యక్తికి ఐదు తులాల వెండి కడియము గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బహుకరించడం జరుగుతుంది, అదేవిధంగా జాతర సందర్భంగా జడ కొప్పు కళాకారుల ఆధ్వర్యంలో జడ కొప్పు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు గొవుర్ నరేష్ రెడ్డి, దేవిదాస్, వెంకట్రామ్ ,శ్రీనివాస్, రామచందర్ రెడ్డి, సాయి రెడ్డి,ప్రవీణ్,సాయిలు,శ్రీకాంత్, సంజీవ్,పెద్ద కాపు సతీష్, సాయిరాం,రాజేష్ , గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.
Spread the love