‘మహాలక్ష్మి’, ‘గృహ జ్యోతి’ పథకాలు ప్రారంభం

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గృహ జ్యోతి పథకం కింద రేషన్‌కార్డు ఉన్నవారికి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ హామీలను సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వల్ల పథకాల ప్రారంభ వేదిక మార్చినట్లు చెప్పారు.

Spread the love