రేపు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మిరుదొడ్డి మండల కేంద్రంలోని మహంకాళి అమ్మవారికి నిర్వహించే బోనాల కార్యక్రమం విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షులు ఎలుముల స్వామి, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పసుల కాడి అంజయ్య, కోరారు. శుక్రవారం మీరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకరు సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి బోనాల సమర్పించడం జరుగుతుందన్నారు. పురాయితులు విట్టల రాజ పున్నయ్య శర్మ ఆధ్వర్యంలోప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాల సమర్పించిన తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. కాబట్టి గ్రామ ప్రజలు, భక్తులు, అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు కుంట నారాయణ, గున్నాల బిక్షపతి, కుంట రాజు, సాన తిరుపతి, సిరినేని వెంకటయ్య,, శేఖర్, నర్సింలు, తోపాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.