మహారాష్ట్ర డిప్యూటీ సీఎం రాజీనామా!

నవతెలంగాణ – హైదరాబాద్: బీజేపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి ప్రతికూల ఫలితాలు రావడంతో.. దానికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటానని తెలిపారు. తన రాజీనామాకు అనుమతించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ప్రభుత్వంలో ఉండకుండా పార్టీ కోసం పని చేయాలనుకుంటున్నట్లు ఫడ్నవీస్ స్పష్టం చేశారు.

Spread the love