గిరిజన గ్రామ పంచాయతీ లకు మహర్ధశ..

– ₹ కోటి 40 లక్షలు నిధులతో శంకుస్థాపనలు..
– ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్
నవతెలంగాణ- డిచ్ పల్లి
గిరిజన గ్రామ పంచాయతీ లకు ఇక నుండి మహర్ధశ ప్రారంభమైందని ఇందల్ వాయి మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనల నిర్మాణం నాకు ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి  ₹ కోటి 40 లక్షలు నిధులను మంజూరు చేశారని, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు శనివారం శంకుస్థాపనలు చేసినట్లు ఇందల్ వాయి ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్ అన్నారు. మండలంలోని గండి తండా రంజిత్ నాయక్ తండా, ఇందల్వాయి తాండ గంగారం తండా, జీకే తాండ ,మెగ్య నాయక్ తండ, స్టేషన్ తాండ గ్రామాలకు ₹20 లక్షల చొప్పున నూతన గ్రామపంచాయతీ భవనాలకు మంజురైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, గిరిజనుల కు మీ తండాలను మీరే పరిపాలించు కోవాలనే నినాదంతో మీరు సంకల్పించుకున్న కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ 500 జనాభా కలిగిన తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని వివరించారు.సేవాలాల్ మహారాజు జయంతిని అధికారికంగా ప్రకటించిన ఘనత కెసిఆర్ గారిది, అదేవిధంగా హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ లో, చాలా ఖరీదైన ప్రాంతాల్లో 21 కోట్ల రూపాయలతో బంజారా భవన్ ను కేసీఆర్ నిర్మించరన్నారు. రాష్ట్రంలో ఎస్టీ పిల్లలకు దాదాపు గురుకుల రెసిడెన్స్ అన్నీ కలుపుకొని 123 స్కూల్స్ మంజూరు, అదేవిధంగా గురుకుల రెసిడెన్సి స్కూల్లో టీచర్లు మొత్తం 3,520 మంది పనిచేస్తున్నారని, దీంట్లో మొత్తం విద్యార్థులు 66,128 పిల్లలు చదువుతున్నారని అని పేర్కొన్నారు.గిరిజనులకు 6% శాతం రిజర్వేషన్ ను 10% శాతం రిజర్వేషన్ పెంచి దాని ద్వారా విద్య రంగం లో వైద్య రంగం లో ఉద్యోగ రంగం లో అవకాశం కల్పించిన్నారు. ఎన్నో ఏళ్ల నుండి పోడు భూమి సమస్య కు ఇబ్బందికి గురి అవుతున్న గిరిజనులకు పోడు భూమి పట్టాలు ఇచ్చి త్వరలో శాశ్వత పరిష్కారం చూపించనున్నారు. బ్యాంకు రుణాలు తో పాటు రైతు బంధు రైతు భీమా కల్పించానట్లు తెలిపారు.అనంతరం సేవలాల్‌ మహరాజ్‌ మార్గం, జీవితం బంజారాలకు మార్గదర్శకమన్నారు, ఘనంగా గిరిజనోత్సవం, సేవాలాల్‌ భోగ్‌ బండర్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బుసని అంజయ్య, ఎంపిడిఓ రాములు నాయక్ పిఅర్ ఏఈ కిషన్, ఉపసర్పంచ్ సుధాకర్ సుద, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలివేరి దాసు, సర్పంచ్ లు చందర్ నాయక్, మోహన్ నాయక్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, పులి వసంత సాగర్, ఉపసర్పంచ్ సుధాకర్ సుద,ఎంపీటీసీ లు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Spread the love