మహబూబాబాద్ కిడ్నాప్ గ్యాంగ్ కలకలం

నవతెలంగాణ – మహబూబాబాద్: పట్టణంలో పట్టపగలే పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ రెచ్చిపోయింది. పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఏడేళ్ల చిన్నారి మూతికి చేయి అడ్డు పెట్టి కిడ్నాప్‌కు యత్నించాడు. దీన్ని గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని.. దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాప్‌కు యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.

Spread the love