నవతెలంగాణ -వేములవాడ రూరల్
టిబి రహిత జిల్లా చేయడానికి టి బి అలర్ట్ ఇండియా కార్యక్రమాన్ని డి శ్రీనివాస్ గురువారం వేములవాడ అర్బన్ మండలంలోని అనుపురం గ్రామంలో గ్రామ ప్రజలకు టిబి వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి వ్యాధికి గురైతే డాక్టర్లు సూచించిన మందులను విధిగా వాడాలని అన్నారు. టీబీ వ్యాధి పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి గ్రామాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ సెంటర్ సూపర్వైజర్, ఏఎన్ఎంఎస్ , ఆశ కార్యకర్తలు డి శోభారాణి ,పి వెంకటమ్మ ,సిహెచ్ జయ, పి రాజమణి, వై శ్రీలత తో పాటు తదితరులు ఉన్నారు.