పాఠశాలలను కళావేదికలుగా తీర్చిదిద్దండి

బాలసాహిత్య సమ్మేళన తీర్మానం
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాదులో నిర్వహించిన రెండు రోజుల బాల సాహిత్య సమ్మేళనం గురువారం ముగిసింది. విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తులను వెలికి తీయడం కోసం పాఠశాలలను కళావేదికలుగా రూపొందించేందుకు కృషి చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యా యులను కోరుతూ సమ్మేళనం తీర్మానించింది. పాఠశా లల్లోని తెలుగు ఉపాధ్యాయులు, ఆయా ప్రాంతాల్లో ఉన్న కవి, రచయితలన సేవలను ఇందుకోసం విని యోగించుకోవాలని సూచించింది. పాఠశాల స్థాయి లోనే పిల్లలను రచయితలుగా కళాకారులుగా మలచవ చ్చునని అభిప్రాయపడింది. పరిషత్తు అధ్యక్షులు ఆచా ర్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె.చెన్నయ్య నిర్వహణలో రోజంతా జరిగిన వివి ధ సదస్సుల్లో బాల రచయితలు రచయిత్రులు, బాల సాహితీవేత్తలు, బాలల సాహితీ కళా సృజనలో స్వచ్ఛం దంగా కృషి చేస్తున్న తెలుగు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంగీత, నృత్య, నాటక, చిత్రలే ఖన శిల్పకళల గురించి పరిచయం చేసేందుకు డాక్టర్‌ వడ్డేపల్లి కృష్ణ అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రముఖ విద్వాంసులు కలగా కృష్ణమోహన్‌, కళా కృష్ణ, డాక్టర్‌ జె.విజరు కుమార్జి, జె.వెంకటేశ్వర్లు అత్యంత ఆసక్తిక రంగా ప్రసంగాలు చేశారు. డాక్టర్‌ వెల్దండ నిత్యానంద రావు అధ్యక్షతన పాఠశాలలు బాల సాహిత్య వికాస కేంద్రాలు అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 25 మంది ఉపాధ్యా యులు పాల్గొన్నారు. మధ్యాహ్నం మంచి పుస్తకం సురేష్‌ అధ్యక్షతన జరిగిన బాల రచయితల ఇష్టా గోష్టిలో సుమారు 20 మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాల రచయితలు, రచయితలు పాల్గొని తమ సాహితీ సృజన అనుభవాలను ఆసక్తికరంగా వివరించా రు. అనంతరం జరిగిన సమాపనోత్సవంలో అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ప్రసంగిస్తూ డాక్టర్‌ కే.ఐ.వర ప్రసాద్‌రెడ్డి సౌజన్యంతో నిర్వహించిన బాల సాహిత్య సమ్మేళనం ఫలవంతంగా జరిగిందని సంతప్తి వ్యక్తం చేశారు. మణికొండ వేద కుమార్‌, పరిషత్తు కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ సి.వసుంధర, డాక్టర్‌ సురవరం కృష్ణవర్ధన్‌ రెడ్డి, తురగా ఫౌండేషన్‌కు చెందిన తురగా ఉషారమణి, కార్యక్రమ సమన్వయకర్త గరిపెల్లి అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love