ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని సీనియర్ ఎంటమాలజిస్ట్ రజిని అన్నారు. అబిడ్స్ లోని జిహెచ్ఎంసి ఎండమాలజిస్ట్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఇంటి పరిసరాల్లో రబ్బర్ టైర్లు, పాడైపోయిన వస్తువులు, ప్లాస్టిక్ ,పాలితిని వస్తువుల్లో నీటి నిలువ లేకుండా చూసుకోవాలని సూచించారు. నిలువ ఉన్న నీటిలో దోమలు ఆవాసాలు చేసుకుంటాయని తెలిపారు. పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉంటే దోమల సంతాన ఉత్పత్తి కేంద్రాలుగా ఉపయోగపడతాయని మొక్కలు పెరగకుండా చూసుకోవాలన్నారు. ఇళ్లలో ఉండే కుండీల్లో తులసి, పుదీనా, సిట్రో నల్లా గ్రాస్, లెమన్ గ్రాస్ వంటి మొక్కలను కుండీలో పెంచుకోవడం వల్ల దోమలు చాలా వరకు కంట్రోల్ అవుతాయని అన్నారు. ఇంటి పరిసరాల్లో మురికినీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే నీరు పూర్తిస్థాయిలో డ్రైనేజీలోకి ఇంకుడు గుంతలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వకు దారి తీసే చిన్న చిన్న కూడికలు గుంతలు మూసివేయాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఫ్రైడే- డ్రై డే గా పాటించాలని సూచించారు. దోమల వల్ల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని జ్వరం వచ్చినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు.
ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి..
– సీనియర్ ఎంటమాలజిస్ట్ రజిని
నవతెలంగాణ -సుల్తాన్ బజార్