– రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరరావు పిలుపు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 2 వ తేది నుంచి 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 3 వ తేదీ శనివారం నిర్వహించే తెలంగాణ రైతు దినోత్సవాన్ని రైతు బంధు జిల్లా సమితి సభ్యులు, మండల సమితి సభ్యులు విధిగా పాల్గొని విజయవంతం చేయాలని రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు రావు జోగేశ్వరరావు జిల్లా లోని రైతు బంధు లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. 3 వ తేదీన జిల్లా లోని మొత్తం 67 రైతు వేదికల్లో రైతు దినోత్సవం జరిపి కర్షకుల తో కలిసి సహపంక్తి భోజనాలు చేయాలని సూచించారు. 7 వ తేదీన నిర్వహించే సాగునీటి దినోత్సవం లోనూ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టు లు పాలేరు, వైరా, లంకా సాగర్ కట్టలపై సభలు ఏర్పాటు చేసి,సామూహిక భోజనాలు చేయాలని విజ్ఞప్తి చేసారు. అలాగే 8 వ తేదీన చెరువుల పండుగ చెరువు కట్టలపై సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని, భోజనాలు చేయాలని కోరారు.సకల రైతులు పాల్గొని దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.