అశ్వారావుపేట – నవతెలంగాణ
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ నేపధ్యంలో గురువారం నిర్వహించబోయే బీఆర్ఎస్ మండల స్థాయి విస్త్రుత సమావేశాన్ని విజయవంతం చేయాల్సింది ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ మూర్తి కోరారు.ఈ మేరకు బుధవారం మండల స్థాయి ముఖ్యనాయకులు సమావేశం అయ్యారు. భద్రాచలం – భూర్గంపాడు రోడ్ లో 3 వ కిలోమీటర్ రాయి దగ్గర గల చిన్నం శెట్టి వెంకట నరసింహం వ్యవసాయ క్షేత్రంలో,మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అద్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,రాజ్యసభ ఎమ్.ఎల్.సీ వద్దిరాజు రవిచంద్ర హాజరు అవుతారని ప్రకటించారు. ఈ సమావేశంలో వైస్.ఎం.పీ.పీ చిట్టూరి ఫణింద్ర,మందపాటి రాజమోహన్ రెడ్డి,జూపల్లి కోదండ వెంకట రమణారావు,సంక ప్రసాద్ రావు,తాడేపల్లి రవి,సత్యవరుపు సంపూర్ణ,కలకోటి సత్యనారాయణ లు పాల్గొన్నారు.