– బట్టుపల్లి అనురాధ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సభ్యురాలు
నవతెలంగాణ – భువనగిరి
డిసెంబర్ 15,16,17 తేదీలలో చౌటుప్పల్ లో జరిగే సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సభ్యురాలు బట్టుపల్లి అనురాధ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం భువనగిరి పట్టణంలో ఇంటి ఇంటికి సీపీఐ(ఎం) రెండు రోజుల కార్యక్రమాన్ని బంజారాహిల్స్ కాలనీలో ఈ రోజు బట్టుపల్లి అనురాధ ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో మూసీ మురికినీటి సమస్యపై , జిల్లా ప్రజా సమస్యలపైన సీపీఐ(ఎం) ఆధ్యర్యంలో జిల్లా వ్యాపితంగా నెల రోజులపాటు పాదయాత్ర నిర్వహించి పోరాడింది జిల్లా లో ఏకైక పార్టీ సీపీఐ(ఎం) అని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వందలాది మందితో రెండు రోజులపాటు వంట వార్పులతో నిద్రలు చేసి ప్రభుత్వాన్ని మేల్కొల్పింది సీపీఐ(ఎం) అని గుర్తుచేశారు. మూసి నీటి కాలుష్యాన్ని అరికట్టాలని – ప్రత్యామ్నాయ గోదావరి నీటిని అందించాలని బునాదిగాని కాలువ, భీమలింగం, పిలాయిపల్లి కాలువల సాధన కోసం వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని నిరంతరం పోరాటాలు నిర్వహించింది సీపీఐ(ఎం) అని తెలిపారు. దేశ వ్యాపితంగా బీజేపీ రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలపై కార్పోరేట్ విధానాలపై పోరాటాలు నిర్వహించడంలో సీపీఐ(ఎం) ముందుండి పోరాడుతుందని తెలిపారు. ప్రజలు సీపీఐ(ఎం) ప్రజా ఉద్యమాలకు ఆర్ధిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. చౌటుప్పల్ లో జరిగే సీపీఐ(ఎం) జిల్లా మహాసభల సందర్భంగా డిసెంబర్ 15 న వేలాదిమందితో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, బహిరంగ సభ సమీకరణకు,మహాసభల నిర్వహణకు, భవిష్యత్ ఉద్యమాలకు ఇంటింటికి సీపీఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలంత ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్ గౌడ్, కల్లూరు మల్లేశం, దాసరి పాండు, పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, జిల్లా కమిటి సభ్యులు బొలగాని జయరాములు, రాచకొండ రాములమ్మ, మండల కార్యదర్శులు పోతరాజు జహంగీర్, కొల్లూరు ఆంజనేయులు,ర్యాకల శ్రీశైలం,గాడి శ్రీను, పల్లెర్ల అంజయ్య, జిల్లా నాయకులు లావుడ్య రాజు, చింతల శివ, బోడ భాగ్య, కల్లూరి నాగమణి, సిలివేరు ఎల్లయ్య, అంజయ్య, కొండ అశోక్, పల్లెర్ల రంగయ్య, మహేందర్, భాస్కర్, డానియెల్, లలిత, కిరణ్, శ్రవణ్, లక్ష్మయ్య, యాదయ్య పాల్గొన్నారు.