నవతెలంగాణ – తుర్కపల్లి
డిసెంబర్ 15 న చౌటుప్పల్ లో జరిగే జనజాతర బహిరంగ సభ జయప్రదం కోరుతూ తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామంలో పత్తిపాటి రామణాకర్ దర్శకత్వంలో తీసుతున్న షార్ట్ ఫిలింని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఐ(ఎం) నిర్వహించే ఈ బహిరంగ సభలో ప్రజలు ,కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆధునిక కాలంలో ప్రజలను ,యువతను చేరుకోవడం కోసం షార్ట్ ఫిలింని తీసుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మండల నాయకులు కొక్కొండ లింగయ్య తలారి మాతయ్య తుటి వెంకటేశం కోట నాగరాజు మంత్రి నరసింహ కోట బిక్షపతి సిహెచ్ దానయ్య భగవంతు బాలయ్య లక్ష్మి భారతమ్మ చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.