– మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-దామరచర్ల
తమ సమస్యల పరిష్కరించాలని ఈనెల 25 న చేపట్టే సమ్మెలో ఆశా వర్కర్ల పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. ఆశా వర్కర్ల మండల నాయకురాలు ఎస్ జయమ్మ అధ్యక్షతన దామరచర్ల లో మంగళవారం జరిగిన ఆశా వర్క్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని, కోవిడ్ 19 సమయంలో ఆశా వర్కర్లకు 50 లక్షల ఇన్సూరెన్స్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ సమయంలో చనిపోయిన ఆశా వర్కర్లకు ఇంతవరకు ఇన్సూరెన్స్ అందించలేదని చెప్పారు. మిగతా వారికి ఇన్సూరెన్స్ చేయకపోవడం బాధాకరమని అన్నారు. గత కొన్ని నెలల నుండి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. కొన్ని సంవత్సరాల తరబడి పని చేస్తున్నప్పటికీ నేటికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం తగదని చెప్పపార. అదేవిధంగా వీరికి రావాల్సిన కనీస అల్ వెన్స్ ఇవ్వకపోవడంతో పాటు ఇతరత్రా సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 25న నిర్వహించే సమ్మెకు ఆశా వర్కర్లు ఐక్యంగా కదిలి వచ్చి సమ్మెలో పాల్గొన్న విజయవంతం చేయాలని కోరారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాళ్ల డిమాండ్స్ గొంతెమ్మ కోరికలు కావని ఆయన అన్నారు. అవి న్యాయబద్ధమైన కోరికలు ఐనందున వెంటనే ప్రభుత్వం స్పందించి సమ్మెకు పోకముందే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వినోద్ నాయక్ , మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు లక్ష్మీనారాయణ , జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు మహేశ్వరి , సిఐటియు ఆశ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఎస్. జయమ్మ, డి. ఇందిరా అదేవిధంగా కన్వీనర్ బైరం దయానంద , పద్మ, శారద, కవిత, శ్రీదేవి, అడవిదేవలపల్లి ఆశా వర్కర్ల అధ్యక్ష కార్యదర్శులు కవిత, కళావతి తదితరులు పాల్గొన్నారు.