మినీ మేడారం జాతరను విజయవంతం చేయాలి.. 

– చిన్న జాతర అని చిన్నచూపు వద్దు 
– భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి
– భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం
– జాతర విజయవంతనికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలి
– మంత్రులు కొండ సురేఖ, సీతక్క
నవతెలంగాణ -తాడ్వాయి 
వచ్చేనెల ఫిబ్రవరి 12 నుండి 15 వరకు జరిగే మినీ మేడం జాతరను విజయవంతం చేయాలని, చిన్న (మినీ) జాతర అని సంబంధిత అధికారులు చిన్న చూపు వద్దని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పర్యావరణ, అటవీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండా సురేఖ, పంచాయితి రాజ్ గ్రామీణ అభివృద్ధి,  మహిళా,  శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క లు అన్నారు. శుక్రవారం మంత్రలు కొండ సురేఖ , సీతక్క లు  మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం రానున్న  మేడారం సమక్క సారలమ్మ చిన్న జాతరకు పురస్కరించుకొని పర్యావరణ, అటవీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండా సురేఖ, పంచాయితి రాజ్,  గ్రామీణ అభివృద్ధి,  గ్రామీణ నీటి సరఫరా,  మహిళా,  శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మేడారం ఐటిడిఏ గెస్ట్ హౌస్ లో దేవాదాయ శాఖ కమిషనర్ ఈ. శ్రీధర్, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పీ శభరీష్, ఐటీడీఏ పిఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ  మినీ మేడం జాతరకు దాదాపు 40 లక్షల భక్తులు వనదేవతలను  (అమ్మ వాళ్ళను) దర్శించుకునే అవకాశం ఉందని, మనదేవతలను ఏర్పాటు చేయాలని దర్శించుకున్న సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంగరంగ వైభవంగా జరిగే మినీ మేడం జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మినీ మేడం జాతర అన్ని చిన్నచూపుకు చూడకుండా అన్ని శాఖల అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో నిమగ్నం కావాలని సూచించారు. ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు, గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు, నిరంతరం విద్యుత్ సరఫరా, త్రాగునీరు సరఫరా చేయాలని అన్నారు. మహా జాతర సందర్భంగా జరిగిన చిన్న చిన్న సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశం లో అడిషనల్ కలెక్టర్ లు రెవెన్యూ మహేందర్ జి, లోకల్ బాడీస్ సంపత్ రావు, ఆర్డిఓ వెంకటేష్, ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ సునీత, ఈ ఓ రాజేందర్, ఎన్పీడీసీఎల్ (విద్యుత్ శాఖ) ఎస్సీ మల్సూర్, డి ఈ పులుసం నాగేశ్వరరావు, డి.ఎస్.పి రవీందర్, డి ఎం అండ్ హెచ్ ఓ గోపాలరావు, డిప్యూటీ తాసిల్దార్ సురేష్ బాబు, పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు, ఇంజనీరింగ్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఐటిడిఎ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love