ప్రజా పోరాట యాత్రను విజయవంతం చేయండి

సీఐటీయూ జిల్లా నాయకులు చంద్రశేఖర్
నవతెలంగాణ-భిక్కనూర్
ప్రజా పోరాట యాత్రను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు చంద్రశేఖర్ తెలిపారు.మండలంలోని జంగంపల్లి గ్రామంలో గురువారం జరిగిన భూ సాధన సమితి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 20 సంవత్సరాల కింద కొనుగోలు చేసిన భూమిని 14 ఏళ్ల కింద పట్టాలు పొందినప్పటికీ ఈ ప్రభుత్వాలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, పేద ప్రజలు పోరాటం చేస్తూ ఇక్కడనే నివాసం ఉంటున్నారని అన్నారు. ఈ పోరాటా కేంద్రాన్ని సందర్శించడానికి ఈనెల 24న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బస్సుయాత్ర వస్తుందని, యాత్ర జయప్రదానికి గ్రామంలోని నిరుపేదలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యకాశ జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, నాయకుల అర్జున్, ప్రవీణ్, బాబ్జాన్, నరసయ్య, పేరం నర్సవ్వ, బలమని తదితరులు పాల్గొన్నారు.

Spread the love