మానవత్వం చాటుకున్న మల్కాజిగిరి తహశీల్దార్‌

నవతెలంగాణ-నేరేడ్‌మెట్‌
మల్కాజిగిరి తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు మరో మారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ వికలాంగు డు తనకు కావాల్సిన ధవపత్రాల కోసం దరఖాస్తు చేసిన ఐదు నిమిషాల వ్యవథిలోనే సంబంధించిన పత్రాలను అప్పగించి ఔరా అనిపించారు. వివరాల్లోకి వెళ్తే.. నేరేడ్‌ మెట్‌కు చెందిన కార్తీక్‌ (వికలాంగుడు) కుల, ఆదాయ ద్రువీకరణ పత్రాల కోసం నాలుగు రోజుల క్రితం మీ సేవాలో దరఖాస్తు చేసుకున్నాడు. తను ఒక్కడే కార్యాల యానికి వెళ్ళలేక పోవడంతో ఓలా బైక్‌ని బుక్‌ చేసుకుని మూడు రోజుల నుంచి మండల కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. అయినా తన పని కావడం లేదు. దీంతో గురువారం మరో మారు 12 గంటల సమ యంలో మల్కాజిగిరి మండల కార్యాలయానికి వచ్చిన కార్తీక్‌ను, అప్పుడే కార్యాలయానికి వస్తున్న తహశీల్దార్‌ వెంకటేశ్వర్‌రావు గమనించారు. తను వచ్చిన పని ఏంటని కార్తీక్‌ను తహశీల్దార్‌ అడిగి అన్ని వివరాలు తెలు సుకున్నారు. అతనికి ఇవ్వాల్సిన కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు ఆర్‌ఐ, తహసీల్దార్‌తో రిపోర్ట్‌ రాయించి ఐదు నిమిషాల్లో ఆ వికలాంగునికి కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఇటీవల జిల్లా ఉత్తమ ఉద్యోగిగా తహశీల్దార్‌ వెంకటేశ్వర రావు అవార్డును అందుకుని ఆ పదవికి వన్నె తెచ్చారని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ తాను ఏ ఉద్యోగం చేసినా అక్కడి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటానని చెప్పారు.

Spread the love