నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కొంతమంది కావాలనే తనను టార్గెట్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారని ఆరోపించారు. హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకొని తాను అప్పుడు కాలేజీ కోసం రోడ్డు వేశానన్నారు.