బీజేపీ టెర్రరిస్టుల పార్టీ: మల్లిఖార్జున ఖర్గే

నవతెలంగాణ – ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని ‘అర్బన్ నక్సల్’ నియంత్రిస్తోందన్న ప్రధాని నరేంద్ర మోడీ వాదనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రధానికి అలవాటుగా మారిందన్న ఖర్గే.. బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అని కౌంటర్ ఇచ్చారు. “ప్రధాని(నరేంద్ర మోడీ ప్రతిసారి కాంగ్రెస్ పార్టీపై అర్బన్ నక్సల్ పార్టీ అంటూ ముద్ర వేస్తున్నారు. ప్రగతిశీల వ్యక్తులను అర్బన్ నక్సల్స్ అని పిలుస్తున్నారు. ఇది ఆయనకు అలవాటుగా మారింది. మరి ఆయన పార్టీ మాటేమిటి? బీజేపీ తీవ్రవాదుల పార్టీ. వారు హత్యలు చేస్తారు. ప్రజలపై దాడులు చేస్తారు షెడ్యూల్డ్ వ్యక్తుల నోటిలో మూత్ర విసర్జన చేస్తారు. అది వారి పార్టీ చేసే పని. కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేసే హక్కు ఆయనకు లేదు..” అని ఖర్గే విమర్శించారు.

Spread the love