నవతెలంగాణ – ఢిల్లీ: గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో తాము బాగా పుంజుకున్నామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈసారి కచ్చితంగా ఇండియా కూటమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ఐదో విడత పోలింగ్ ముగిసే సమయానికి విపక్ష కూటమి పుంజుకుంది. ప్రభుత్వంతో పోరాడేందుకు దళిత, వెనుకబడిన వర్గాలు కూటమికి మద్దతు పలుకుతున్నాయి. బీజేపీని ఓడించేందుకు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు వ్యూహాలను అనుసరించాం’ అని ఆయన తెలిపారు.