నవతెలంగాణ – ఢిల్లీ: తెలంగాణలో 40 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేసేందుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అన్నారు. 16ఏళ్ల కిందట యూపీఏ సర్కార్ 3.73 కోట్ల మంది రైతుల రూ.72వేల కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. ‘మోడీ ప్రభుత్వం రైతులపై 3 నల్ల చట్టాలను ప్రయోగించింది. కిసాన్ న్యాయ్ కింద రుణమాఫీ కమిషన్, మద్దతు ధరలు లాంటి హామీలు కాంగ్రెస్ ఇచ్చింది. మా అజెండా ఎప్పటికీ చెక్కు చెదరదు’ అని ఖర్గే ట్వీట్ చేశారు.