మల్లు రవికి నాగర్ కర్నూల్ పార్లమెంటు టికెట్ కేటాయించాలి

– కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వస్పుల జంగయ్య, గుర్రం కేశవులు డిమాండ్
-30 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వ్యక్తి డాక్టర్ మల్లు రవి
– సీఏం చొరవచూపి మల్లు కు టికెట్ ప్రకటించి సస్పెన్స్ కు తెరదించాలన్నారు.
– రవి‌కి టికేట్ కన్ఫాం కావాలని కోరుతూ నేటి నుంచి దేవాలయాల్లో, మస్జిద్ లలో, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు
నవతెలంగాణ – ఆమనగల్ 
పార్టీని నమ్ముకొని, పార్టీ కోసం 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఐసిసి ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవికి నాగర్ కర్నూల్ పార్లమెంటు టికెట్ కేటాయించాలని రాష్ట్ర పీసీసీ ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ వస్పుల జంగయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ సర్పంచ్ గుర్రం కేశవులు డిమాండ్ చేశారు. శనివారము ఆమనగల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి వారు మాట్లాడారు. 2004 లో నాగర్ పార్లమెంటు స్థానాన్ని రత్నంకు, 2009 లో కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చిన మంద జగన్నాథంకు కేటాయించిన మల్లు రవి నిరుత్సాహ పడకుండా వారి గెలుపే లక్ష్యంగా పనిచేశారని వారు గుర్తుచేశారు. 2014 లో నంది ఎల్లయ్య గెలుపుకు కృషి చేసి, పార్టీ ఆదేశాల మేరకు మొక్కవోని ధైర్యంతో 2019లో ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనా పార్టీని కార్యకర్తలను వెన్నంటి ఉన్న మహా నాయకుడు మల్లు రవి అని వారు పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏ గ్రామంలో అడిగినా ఎంపి అంటే మల్లు రవి అని ప్రజలు చెప్తారని కావాలంటే సర్వే నివేదికలను చూసుకోవాలని వారు చెప్పుకొచ్చారు. పార్టీ కార్యక్రమాలతో పాటు నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో పిలిస్తే పలికే వ్యక్తిగా మంచి పేరున్న మల్లు రవి పేరును వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కొడంగల్ సభలో మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మల్లు రవిని ప్రకటించి నియోజకవర్గంలో నెలకొన్న సస్పెన్స్ కు తెరదించాలని వారు పేర్కొన్నారు. మల్లు రవికి నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించాలని వేడుకుంటూ రేపటి నుంచి దేవాలయాల్లో,  మస్జిద్ లలో, చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేయాలని నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మల్లు రవి అభిమానులకు వారు పిలుపునిచ్చారు. ఈసమావేశంలో ఎస్సీ సెల్ నాయకులు కాలే మల్లయ్య, జంతుక యాదయ్య, కొప్పు రాఘవేందర్, జిల్లా ఎస్టీ సెల్ నాయకులు నేనావత్ రవీందర్ నాయక్, రాష్ట్ర చెంచు సంఘం నాయకులు మండ్లి రాములు, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఐఎన్ టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎంగలి ప్రసాద్, లచ్చి మండ్లి, శ్రీకాంత్, బావోజీ తదితరులు పాల్గొన్నారు.
Spread the love