ప్రజల కోసం అవసరమైతే రాజీనామాకు సిద్ధం: మమతా బెనర్జీ

నవతెలంగాణ – పశ్చిమ బెంగాల్‌ : కోల్‌కతా లైంగికదాడి ఘటనపై వైద్యుల సమ్మె కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రయోజనాల కోసం అవసరమైతే రాజీనామా చేసేందుకైనా తాను సిద్ధమని ప్రకటించారు. మఅతురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు. డాక్టర్ల సమ్మెతో 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 27 మంది మఅతి చెందారని వివరించారు. డాక్టర్లతో సమావేశం కోసం నిన్న రెండు గంటల పాటు ఎదురుచూశానని ఆమె వెల్లడించారు. డాక్టర్లతో చర్చలకు ఇప్పటికే మూడు సార్లు ప్రయత్నించానని తెలిపారు. హత్యాచార కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని ఆమె పేర్కొన్నారు. జూనియర్‌ డాక్టర్లతో చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేమని స్పష్టం చేశారు. భేటీపై వీడియో రికార్డింగ్‌ కు ఏర్పాట్లు చేశామని చెప్పారు. సుప్రీంకోర్టు అనుమతితో ఫుటేజిని డాక్టర్లకు అందజేస్తామని అన్నారు. ఆందోళన చేస్తున్న జూనియర్‌ డాక్టర్లపై చర్యలు తీసుకోబోమని ఆమె స్పష్టం చేశారు.

Spread the love