మోడీజీ మీకు గుడి కట్టిస్తా: మమత బెనర్జీ

నవతెలంగాణ – ఢిల్లీ : భారత ప్రధాని మోడీ తనను తాను దేవుడిలా భావిస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ‘దేశ ప్రయోజనం కోసం దేవుడు తనను పంపాడంటూ ఇటీవల మోడీ అన్నారు. ఆయన నిజంగా తనను తాను దేవుడు అనుకుంటే.. నాదొక విన్నపం. మోడీజీ.. మీకో గుడి నిర్మిస్తా. ప్రసాదంగా డోక్లా పెడతా. నిత్యం పూజలు చేస్తా. దయచేసి ఆ గుడిలోనే కూర్చోండి. దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలు ఆపేయండి’ అంటూ ఆమె మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Spread the love