లాలూతో మమత భేటీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : శుక్రవారం జరగబోయే ప్రతిపక్షాల సమావేశాల్లో పాల్గొనడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే పాట్నా చేరుకున్నారు. ఆమె వెంట ఆమె మేనల్లుడు,ఎంపి అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు. గురువారం సాయంత్రం పాట్నా చేరుకున్న మమత ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ ఇంటికి వెళ్లి లాలూ, ఆయన సతీమణి రబ్రీదేవి, తనయుడు, బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్‌ను కలిసి మాట్లాడారు. దాదాపు పావు గంట సేపు లాలూ కుటుంబ సభ్యులతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మమత బీజేపీని ఓడించి తీరుతామన్నారు.

Spread the love