కొడవలితో యువతిని వెంబడించి వ్యక్తి దాడి..

నవతెలంగాణ – ముంబై: స్కూటీపై వెళ్తున్న యువతిని ఒక వ్యక్తి అడ్డుకున్నాడు. తన వద్ద ఉన్న కొడవలిని బయటకు  తీసి అమె దగ్గరకు వెళ్లి నరకలని చూసడు ఈ క్రమంలో తప్పించుకునేందుకు ఆ మహిళ పరుగులు తీసింది. వెంబడించిన ఆ వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. గమనించిన స్థానికులు అతి కష్టంమీద అతడ్ని అడ్డుకుని ఆమెను కాపాడారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. స్కూటీ నడుపుతున్న 20 ఏళ్ల ప్రీతి రామచంద్రను మంగళవారం శంతను లక్ష్మణ్ జాదవ్‌ అనే వ్యక్తి రోడ్డుపై అడ్డుకున్నాడు. తన వద్ద ఉన్న కొడవలిని బయటకు తీసి ఆమెపై దాడికి ప్రయత్నించాడు. ఆమెపై కొడవలితో రెండుసార్లు దాడి చేశాడు. కాగా, కొడవలితో యువతిపై దాడిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. చేతికి అందిన వస్తువులను లక్ష్మణ్‌ మీదకు విసిరారు. దీంతో అతడు ఆ ఆయుధాన్ని చూపించి స్థానికులను భయపెట్టేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఆ మహిళ పైకి లేచి అక్కడి నుంచి పరుగుపెట్టింది. చివరకు స్థానికులు అతికష్టం మీద లక్ష్మణ్‌ను పట్టుకున్నారు. ఈ విషయం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అతడ్ని అప్పగించారు.

Spread the love