నవతెలంగాణ-డిండి : బాత్రూంలో ఉన్న యాసిడ్ త్రాగి వ్యక్తి మరణించిన సంఘటన డిండి మండలం ప్రతాప్ నగర్ గ్రామంలో లో బుధవారం జరిగింది. డిండి ఎస్సై బి.రాజు తెలిపిన వివరాల ప్రకారం డిండి మండలంలోని ప్రతాప్ నగర్ గ్రామంలో తెలకపల్లి హరికృష్ణ తండ్రి రాములు ( 26 ) అనే వ్యక్తి తన తల్లి ఇద్దరు ఆ ఊరులో జీవిస్తున్నారు. హరికృష్ణ లారీ నడుపుకుంటు జీవిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా హరికృష్ణ తాగుడుకు బాగా బానిసై తన తల్లిని డబ్బుల కోసం వేధిస్తుండేవాడు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో క్షణికావేశంలో బాత్రూంలో ఉన్న యాసిడ్ ను త్రాగటంతో వెంటనే అతన్ని దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా అక్కడ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లవలసిందిగా సూచించారు. హైదరాబాదులోని వెల్నెస్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స నిర్వహిస్తుండగా గురువారం తెల్లవారుజామున 3.10 నిమిషాల సమయంలో చనిపోవడం జరిగినట్లు ఎస్సై తెలిపారు. మృతుని మామ పులి తిరుపతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.