ఏజెంట్ మోసంతో వ్యక్తి ఆత్మహత్య

నవతెలంగాణ – రామారెడ్డి
గల్ఫ్ఏజెంట్ మోసంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన సుద్దాల చిన్న రాజయ్య (46) బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లడానికి పోసానిపేట గ్రామానికి చెందిన పళ్లెం భరతుని సంప్రదించి ఆయనకు రూ.ఒక లక్ష యాభై వేలు చెల్లించాడు. నెలలు గడుస్తున్నా గల్ఫ్ దేశానికి పంపకపోవడం, అప్పులు పెరిగిపోవడం, అప్పుల వారు ఇంటికి రావడం, ఏజెంట్ మొహం చాటి వేయడంతో, అప్పుల బాధతో మన స్థాపం చెంది సొంత వ్యవసాయ పొలంలో చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. గతంలో అన్నారం గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తుల వద్ద రూ 80,000 తీసుకొని కంపెనీ విజా అని చెప్పి, విజిట్ వీసాపై పంపి మోసం చేశాడని, భరత్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
Spread the love