ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Man committed suicide by hanging himselfనవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ నగరంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని నమ్మించి తన ప్లాట్ ను కాజేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నట్లు ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్సై గంగాధర్ మంగళవారం తెలిపారు. ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం నాగారం లోనీ 80 క్వార్టర్స్ లోని నాగరాజు ఆయన భార్య మాధవి తాలూకు పెద్దమ్మకు సంతానం లేరు. ఆమెకు చెందిన భూమిని నాగరాజు గౌడ్(54) భార్య మాధవి కి ఇవ్వడానికి సిద్ధం అయింది. మాధవి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఆ భూమి రిజిస్ట్రేషన్ పక్రియ చేయించాలని నాగారం కు చెందిన మల్లేష్ ను కోరాడు. స్నేహితుడే కావడంతో గుడ్డిగా నమ్మాడు. కానీ మల్లేష్ ఆ భూమిని మాధవి పేరు మీద కాకుండా ఇతర వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. విషయం తెలిసి నాగరాజు గౌడ్ గత పది రోజుల క్రితం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ మల్లేష్ అక్కడి పోలీసులను మేనేజ్ చేయడంతో మనస్థాపానికి గురై సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.
Spread the love