గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన గొంటిముక్కుల విజయ్(32)కు శుక్రవారం ఆయన నివాసంలో ఒక్కసారిగా ఫిడ్స్ రాగ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబీకులు వెంటనే రిమ్స్ కు తరలించారు. వైద్యులు పరిశీలించి ఈసిజీ చేశారు. అయితే అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. దింతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. శనివారం ఆయన స్వగృహంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.