బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

RTC bus collided with a bike.. Man diedనవతెలంగాణ – వనపర్తి: గోపాల్ పేట మండలం బుద్ధారం గండి దగ్గర హైదరాబాదు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం మమ్మాయి పళ్లి గ్రామానికి చెందిన ఏండ్ల మార్ కొండయ్య (36) గా గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గోపాల్ పేట ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love