విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండల పరిధిలోని అన్న సార్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం అన్నసాగర్ గ్రామానికి చెందిన కొనగండ్ల రవి తన భార్యతో కలిసి అదే గ్రామానికి చెందిన సాయికిరణ్, రమేష్ అనే వ్యక్తులు కౌలు చేస్తున్న భూమిలో నాటు వేయడానికి శుక్రవారం నాడు ఉదయం వెళ్లారని, అక్కడ రవి పనిలో భాగంగా గంపలో వరి నారు తలపై పెట్టుకుని తీసుకువస్తుండగా తక్కువ ఎత్తులో ఉన్న కరెంటు తీగలు ప్రమాదవశాత్తు వరి నారుకు తగలడంతో రవి కరెంట్ షాక్ కు గురై పొలంలో పడిపోగా వెంటనే కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరని డాక్టర్ పరీక్షించి అప్పటికే అతను మరణించినట్లు తెలిపారన్నారు. కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్సై మహేష్ తెలిపారు.