నవతెలంగాణ – నిజాంసాగర్
మహమ్మద్ నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామానికి చెందిన రౌతు సాయిలు (53) అనే వ్యక్తి ఉదయం హైదరాబాద్ వెళ్లేందుకు రెడీ అవ్వడానికి స్నానానికి వేడి నీళ్లను వాటర్ హీటర్ తో పెట్టుకునే సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని నిజాంసాగర్ ఎస్ఐ సుధాకర్ తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం జరిగిందని తెలపారు. మృతుడు సాయిలు కు భార్య పిల్లలు ఉన్నారు. కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.