ఏపీలో కాల్పుల కలకలం.. వ్యక్తి మృతి

నవతెలంగాణ – అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తుంది. ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. జిల్లాలోని నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామంలో ఇంటి వద్ద ఉన్న డాక్యుమెంట్‌ రైటర్‌ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న కాట్రగడ్డ ప్రభాకర్‌ అనే వ్యక్తిని కారులో వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love