నీట మునిగి వ్యక్తి మృతి

నవతెలంగాణ – ధర్మసాగర్
నీట మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం 9 గంటలకు ఉరుసు కరీమాబాద్ కోట వరంగల్ నగరానికి చెందిన దూడ రవితేజ(26)  తన స్నేహితుడైన నర్సింగరావు పల్లి గ్రామానికి చెందిన మండల అరుణ్ కుమార్  తాత  దినకర్మకు రావడం జరుగుతుందని, ఈ క్రమంలో ఎల్కుర్తి సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్దకి బహిర్భూమికి తన బావ రోహిత్తో కలిసి రావడం జరిగింది. నీటి కోసమై రఘు కెనాల్ లోకి దిగబోతుండగా ప్రమాదవశాత్తు కెన్నాళ్లు పడి నీటిలో మునిగి  మృతి చెందడం జరిగిందని తెలిపారు. మృతుని వరుసకి అన్న అయిన దూడ పవన్ కుమార్ తండ్రి కోటేశ్వర్ అనే వ్యక్తి దరఖాస్తు ఇవ్వగా కేసు  నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
Spread the love