నవతెలంగాణ – చెన్నారావుపేట
రోజువారీగా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనికి వెళ్తున్న ఓ వ్యక్తి చెలుక రొటివేటర్ దున్నే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి రెండు కాళ్ళు కోల్పోయిన ఘటన చెన్నారావుపేట మండ లంలోని ఎల్లాయిగూడెం గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..చెన్నారావుపేట మండలం జోజి పేట నారాయణతండా గ్రామానికి చెందిన బానోతు విష్ణు( 19) ఎల్లాయిగూడెం గ్రామ పరిధి మాధవనగర్ కాలనీకి చెందిన రూపిక వెంకన్న దగ్గర రోజువారీగా ట్రాక్టర్ డ్రైవర్ గా పనికి వెళ్తున్నాడు. శనివారం సాయంత్రం ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన చెలుక రొటివేటర్ దున్నే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా రొటివేటర్ లో పడిపోవడంతో రెండు కాళ్ళు కోల్పోయి తీవ్ర గాయలపాలయ్యాడు. గమనించిన స్థానికులు అతన్ని బయటకు లాగి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు బాధితుడిని వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చే యిస్తున్నారు. కాగా రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి చెందిన విష్ణు ప్రమాదవశాత్తు కాళ్ళు కోల్పోవడంతో చికిత్స చేయించడం ఆ నిరుపేద కుటుంబ సభ్యులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి బాధితుడికి ఆర్ధిక సహాయం అందించి బాధితుడికి మెరుగైన వైద్యమందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.