నవతెలంగాణ- తాడ్వాయి
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, ఎస్ .ఐ ప్రసాద్ దేవునిపల్లి తెలిపిన వివరాల ప్రకారం దేవునిపల్లి గ్రామానికి చెందిన దేవల చాకలి నారాయణ(60), ఈయన ప్రతిరోజు ఉదయం తన సైకిల్ పై కామారెడ్డికి వెల్లి పాలు పోసి వచ్చేవాడు.అలాగే 21వ తేదీ రోజున కూడ కామారెడ్డి లో పాలు పోసి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఉదయం 9.15 గంటలకు దేవుని పల్లి గ్రామంలో ని అంబేద్కర్ విగ్రహం వద్ద వెనకాల నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు టీఎస్ 16 యుసి 2966 బస్సు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో చాకలి నారాయణ కాలు పూర్తిగా విరిగిపోయిందని, నారాయణ తమ్ముడు దేవల చాకలి శంకర్ కు ఫోన్ ద్వారా సమాచారం రావడంతొ వెంటనే అక్కడికి చేరుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము. నారాయణకు కాలు పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించామని దేవల శంకర్ చెప్పారు. నారాయణ తమ్ముడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.