భూ ప్రకంపణ.. వణికిన మణిపూర్, అండమాన్

నవతెలంగాణ – హైదరాబాద్: భూ ప్రకంపణలతో అండమాన్‌ దీవులు, మణిపూర్‌లోని ఉక్రుల్‌ వణికిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున 3.39 గంటలకు అండమాన్‌ సముద్ర తీరంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ  తెలిపింది. భూ అంతర్భాగంలో 93 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. సోమవారం వేకువజామున 4.4 తీవ్రతతో బంగాళాఖాతం  తీరంలో భూమి కంపించిందని పేర్కొంది. Er 1 ఇక సోమవారం రాత్రి 11.1 గంటలకు మణిపూర్‌లోని ఉఖ్రుల్‌ జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 5.1గా నమోదయిందని ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులు ప్రకంపణలు చోటుచేసుకున్నాయని తెలిపింది. రాత్రివేల భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు

Spread the love