నవతెలంగాణ – హైదరాబాద్: హీరో మంచు విష్ణు చేసిన ఒక మంచి పనికి అందరూ హ్యాట్సాఫ్ చెపుతున్నారు. తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఉండే మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను విష్ణు దత్తత తీసుకున్నారు. విద్య, వైద్యంతో పాటు అన్ని విషయాల్లో వీరికి తాను ఒక అన్నగా అండగా ఉంటానని ఈ సందర్భంగా విష్ణు తెలిపారు. ఎలాంటి స్వలాభం లేకుండా మాతృశ్య సంస్థ నిర్వాహకురాలు శ్రీదేవి 120 మంది అనాథలను ఆదరిస్తున్నారని మంచు విష్ణు కొనియాడారు. వారితో పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని అనాథలకు సాయం చేయాలని కోరారు.