విజయ సంకల్ప సభ లో మండల బీజేపీ నాయకులు

నవతెలంగాణ-గోవిందరావుపేట

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వరంగల్ వస్తున్న సందర్భంగా శనివారం మండలంలోని బీజేపీ శ్రేణులు పార్టీ  అధ్యక్షుడు మద్దినేని తేజ రాజు ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. వెళ్లిన వారిలో మహబూబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ తక్కలపల్లి దేవేందర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగ రవీందర్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి కర్ర సాంబశివరెడ్డి, అంతి రెడ్డి సత్యనారాయణ రెడ్డి,కొత్త సుధాకర్ రెడ్డి, మెరుగు సత్యనారాయణ, మద్దినేని శ్రీనివాస్, బర్ల సంజీవరెడ్డి, సాబాది  చంద్రారెడ్డి, బద్దం జనార్ధన్,కర్ణ లతోపాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు.

Spread the love