ములుగు జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) ఒంటేరు దేవరాజ్ మండల ప్రత్యేక అధికారిగా నియమితులైనందుకు బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రి ఆదేశాల మేరకు ఆయనకు బోకే అందించి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. మండల అభివృద్ధికి సహకరించి, కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్, పిఏసీఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య , మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రేగ కళ్యాణి, మండల ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వర్ రావు , మాజీ సర్పంచ్ లు బెజ్జూరి శ్రీనివాస్, మంకిడి నరసింహ స్వామి, ముజఫర్, మాజీ ఎంపిటిసి ఇర్సవడ్ల నారాయణ, సింగిల్ విండో డైరెక్టర్ లు మల్లయ్య, యానాల సిద్ది రెడ్డి , లింగచారి, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చర్ప రవీందర్, మండల నాయకులు సీనియర్ పులి రవి గౌడ్, పురుషోత్తం నారాయణ, పాక రాజేందర్, కోటే నరసింహులు,
శ్రీనివాస్ వేణుగోపాల్ రెడ్డి, నునావత్ శ్రీను, బండారి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.