కవ్వంపల్లిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు..

– శాలువ కప్పి కవ్వంపల్లికి సన్మానం 

నవతెలంగాణ-బెజ్జంకి 
మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను తన నివాసంలో శుక్రవారం మండల కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి సన్మానించారు. గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల్లో మండల కాంగ్రెస్ శ్రేణులు కృషిపై కవ్వంపల్లి ఆనందం వ్యక్తం చేసినట్టు నాయకులు తెలిపారు.రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు,మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,మండల నాయకులు పాల్గొన్నారు.
Spread the love