నవతెలంగాణ ధర్మారం : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఆదివారం రోజున మండల మున్నూరు కాపు సంఘం సమావేశమై మండల అడ్ హక్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు మల్క రామస్వామి ముఖ్యఅతిథిగా హాజరై దిశ నిర్దేశం చేశారు. హాజరైన సభ్యుల సమక్షంలో చర్చించి గ్రామాల వారిగా సభ్యత్వ నమోదు కోసం అడ హక్ కమిటీని 10 మంది సభ్యులతో ఏర్పాటు చేసి ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి సభ్యత్వ నమోదు రుసుము 500 రూపాయలుగా నిర్ణయించారు. కమిటీ సభ్యులు బృందాలుగా గ్రామాల్లో పర్యటించి ఆయా గ్రామ కమిటీల సహకారంతో సభ్యత్వము చేయాలని, ఈనెల 25వ తేదీ లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని నిర్ణయించారు మండల కమిటీ ఎన్నిక కోసం ఈనెల 29న నామినేషన్లు స్వీకరించి అదే రోజు ఉపసంహరణతో పాటు అభ్యర్థులు పోటీలో ఉంటే బ్యాలెట్ ద్వారా ఈనెల 30న ఎన్నికల నిర్వహించాలని జిల్లా అధ్యక్షుడి సమక్షంలో సమావేశానికి హాజరైన సభ్యులందరూ .అడహక్ కమిటీలు గ్రామాల్లో పర్యటించే ముందు ముందస్తు సమాచారం అందజేస్తారళి జిల్లా అధ్యక్షుడు తెలిపారు ఈ కార్యక్రమంలో అడహక్ కమిటీ సభ్యులు గాండ్ల స్వామి పెంచాల రాజేశ, తన్నీరు రాజేందర్, కొత్త మోహన్. రాచూరు శ్రీధర్, ఆవుల వేణు, గంధం మల్లయ్య బంగుటపు కొమురయ్య ,ఆకారి సత్యం, దీటి శ్రీనివాస్ మండలంలోని వివిధ గ్రామాల కుల సంఘం సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు